News November 1, 2025
బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధ ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 2, 2025
MBNR: మద్యం లక్కీడిప్.. పీఈటీ సస్పెండ్

అత్యాశకు పోయి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ స్కూల్ పీఈటీ (PET) ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాంనగర్‌లోని బాలికల హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప, ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్‌లో ధర్మాపూర్ వైన్ షాపును దక్కించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి టెండర్లలో పాల్గొనడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ అనంతరం డీఈఓ ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు.
News November 2, 2025
NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.


