News November 1, 2025
HNK: ఆకతాయిలు వేధిస్తే షీ టీంకు సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత కోరారు. వరంగల్ ఉర్సుగుట్ట వద్ద కార్ షోరూం ఉద్యోగులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్‌తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఇన్‌స్పెక్టర్ సూచించారు.
Similar News
News November 2, 2025
NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
News November 2, 2025
కామారెడ్డి: మదన్ మోహన్‌కు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ బాధ్యతలు

కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్‌ను ఇన్‌ఛార్జి లోకల్ బాడీ అదనపు కలెక్టర్‌గా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నియమించారు. శనివారం మదన్ మోహన్ బాధ్యతలు స్వీకరించి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


