News November 1, 2025

MHBD: ఈనెల 16న పంచారామాలకు టూర్: DM

image

MHBD డిపో నుంచి నవంబర్ 16న టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని DM కళ్యాణి తెలిపారు. డిపో నుంచి 16న 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గం.కు వెళ్తుందని, పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) చేరుకుని 18న తిరిగి MHBDకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1700, పిల్లలకు రూ.900ఛార్జీ ఉంటుందని, 7396210102, 9948214022 సంప్రదించాలన్నారు.

Similar News

News November 2, 2025

NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

image

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 2, 2025

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

image

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

News November 2, 2025

కామారెడ్డి: మదన్ మోహన్‌కు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ బాధ్యతలు

image

కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్‌‌ను ఇన్‌ఛార్జి లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌‌గా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ నియమించారు. శనివారం మదన్ మోహన్‌ బాధ్యతలు స్వీకరించి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.