News November 1, 2025
సంసార చక్రం నుంచి విముక్తి పొందాలంటే..

మన జీవుడికి 3 రకాల శరీరాలు ఉంటాయి. అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరంలోనే(భౌతిక దేహం) అన్ని కర్మలు చేస్తాం. సూక్ష్మశరీరం(మనస్సు, ఇంద్రియాలు) సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. కారణశరీరం(అజ్ఞాన రూపం) ఆత్మానందాన్ని పొందుతుంది. మనం చేసే పుణ్యపాప కర్మల ఫలంగా సుఖదుఃఖాలు కలుగుతాయి. జీవుడిలా కర్మల బంధంలో, సంసార చక్రంలో తిరుగుతాడు. వీటి నుంచి విముక్తి పొందడానికి శివుడిని ప్రార్థించడమే మార్గం.<<-se>>#SIVOHAM<<>>
Similar News
News November 2, 2025
మహేశ్-రాజమౌళి డిఫరెంట్ ప్రమోషన్స్

మహేశ్-రాజమౌళి SSMB29 మూవీని చాలా కొత్తగా ప్రమోట్ చేశారు. ‘ఆల్రెడీ NOV వచ్చేసింది.. ఏదో రిలీజ్ చేస్తానన్నారు’ అని మహేశ్ ట్వీట్ చేయడంతో టాపిక్ స్టార్టైంది. ‘చిన్నగా ఒక్కోటి రిలీజ్ చేద్దాం’ అని జక్కన్న అన్నారు. ‘సర్‌ప్రైజ్ ఆ.. పృథ్వీరాజ్ కూడా సర్‌ప్రైజ్ అంటారా?’ అని మూవీలో పృథ్వీరాజ్ ఉన్నారని, రేపు ఆయన పోస్టర్ రిలీజ్ కానుందని చాటింగ్‌లో చెప్పేశారు. ఈ <
News November 2, 2025
ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్నది పేగు బంధం’ అని విమర్శించారు.
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.


