News November 1, 2025
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

AP: విశాఖలో సాయితేజ్(21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
News November 2, 2025
కరువు మండలాల జాబితా విడుదల

AP: 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.


