News April 10, 2024
ఉమ్మడి జిల్లాలో కలగానే కల్లాల నిర్మాణాలు !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యం ఆరబోతకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ యాసంగిలో 4,78,649 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 8.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలు కలగానే మిగిలాయి. ధాన్యం ఆరబోతకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కల్లాల నిర్మాణాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News April 21, 2025
రైతులకు భూ భారతి భరోసా: కలెక్టర్

అడ్డాకల్: పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST