News April 10, 2024

ఉండి టీడీపీ ఎమ్మెల్యే.. తగ్గేదేలే?

image

AP: MP రఘురామకృష్ణరాజుకు TDP పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టికెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. TDP టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీ మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీకి కంచుకోట లాంటి ఉండిలో తాజా పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి.

Similar News

News March 21, 2026

అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

image

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.

News March 21, 2026

ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

image

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.

News March 21, 2026

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.