News April 10, 2024

కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయండి: లోకేశ్

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ‘జగన్ బాదుడే బాదుడు! ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి’ అని కోరారు.

Similar News

News November 15, 2024

శాసనమండలిలో రగడ.. మంత్రి ఆగ్రహం

image

AP: మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని YCP ఎమ్మెల్సీలు నినదించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. 26జిల్లాల్లో కాలేజీల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని ఆరోపించారు. అనంతరం YCP సభ్యులు వాకౌట్ చేశారు.

News November 15, 2024

NCP, BJP మీటింగ్‌లో అదానీ: అసలు నిజం చెప్పిన శరద్ పవార్

image

2019లో న్యూఢిల్లీలోని గౌతమ్ అదానీ ఇంట్లో NCP, BJP పొలిటికల్ <<14596038>>మీటింగ్‌<<>> జరగడం నిజమేనని శరద్ పవార్ అంగీకరించారు. ఈ చర్చల్లో అదానీ మాత్రం పాల్గొనలేదని వెల్లడించారు. ఆఖర్లో డిన్నర్‌కు ఆతిథ్యమిచ్చారని తెలిపారు. ఎన్నికలయ్యాక మహారాష్ట్రలో NCP, BJP ప్రభుత్వం 80 గంటల్లో కూలిపోవడానికి ముందు ఈ మీటింగ్ జరిగింది. అందులో Sr పవార్, ప్రఫుల్, షా, ఫడ్నవీస్, తాను పాల్గొన్నట్టు అజిత్ పవార్ చెప్పడం సంచలనమైంది.

News November 15, 2024

త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న

image

AP: వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. 1.44లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు. పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన వారికి రాయితీతో 47వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు.