News April 10, 2024

అనంత: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్

image

మాజీ ఏపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇక్బాల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. గత ఎన్నికలలో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.

Similar News

News April 19, 2026

పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

అనంతపురం జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 15వ స్థానం, సెకండియర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,367 మందికి 15,814 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 20,778 మందికి 15,530 మంది పాసయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.