News November 1, 2025
కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
Similar News
News November 1, 2025
ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News November 1, 2025
ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News November 1, 2025
నిర్మాతగా సుకుమార్ భార్య తబిత

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారనున్నారు. ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బ్యానర్‌లో పదేళ్ల కిందట వచ్చిన బోల్డ్ మూవీ కుమారి21F సీక్వెల్ కుమారి22F తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రావు రమేశ్ నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.


