News November 1, 2025

జూ.పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్ కోటా జాబితా విడుదల

image

TG: జూ.పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు గతంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 172మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్. 2018లో పరీక్ష జరగ్గా 2019లో ఫలితాలు వచ్చాయి. వీరి ఎంపికను వ్యతిరేకిస్తూ HCలో పిటిషన్ దాఖలు కాగా 2021లో ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇటీవల కోర్టు క్లియరెన్స్ ఇవ్వగా జాబితాను రిలీజ్ చేశారు.<>https://epanchayat.telangana.gov.in/cs<<>> HT నంబర్, DOB ఎంటర్ చేసి జాబితాను చూడొచ్చు.

Similar News

News February 27, 2026

విజయ్‌కు ఓ నటితో వివాహేతర సంబంధం.. భార్య ఆరోపణలు

image

హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ <<19254475>>పిటిషన్<<>> దాఖలు చేసిన భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందన్నారు. 2021లో ఈ విషయం తెలిసి మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. ఇది పెళ్లిపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేటట్లు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఇటీవల TNకు చెందిన ఓ BJP నేత సైతం విజయ్‌కు ఓ నటితో అఫైర్ అంటగడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News February 27, 2026

SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

image

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in

News February 27, 2026

నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

image

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే ప్రమాదమే అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే సమయానికి, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.