News April 10, 2024
శ్రీకాకుళం: ట్రాఫిక్ సిబ్బందికి కిట్స్ అందజేత

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్లను ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జీ.ఆర్ రాధిక చేతుల మీదగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే వస్తు సామగ్రి ఓ ప్రైవేటు సంస్థ ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.
Similar News
News October 5, 2025
అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ఆడనున్న కోటబొమ్మాళి యువకుడు

కోటబొమ్మాళికి చెందిన ఈశ్వర్ రెడ్డి అంతర్జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్లో ఆడేందుకు అవకాశం దక్కింది. సెప్టెంబర్ 9-14 వరకు ఒడిశాలో జరిగిన జాతీయ T10 టెన్నిస్ క్రికెట్ పోటీల్లో ఆల్ రౌండర్గా సత్తా చాటాడు. ఈ మేరకు డిసెంబర్ 25-31 వరకు థాయిలాండ్లో జరగనున్న సెకండ్ ఏషియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ షిప్లో పాల్గొనాలని ఇండియా సెలక్షన్ టీం సెక్రటరీ నుంచి ఇవాళ లేఖ అందిందని క్రీడాకారుడు చెప్పారు.
News October 4, 2025
నాగవళి నదిలో రైతు గల్లంతు

ఆమదాలవలస మండలం కనుగులవలసకు చెందిన రైతు నారాయుడు (64) నాగావళి నదిలో శనివారం ప్రమాదవశాత్తూ జారిపడి గల్లంతయ్యారు. దూసి గ్రామం సమీపంలోని పంట పొలాలకు యూరియా జల్లి సమీపంలోని నాగావళి నదిలో చేతులు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో జారి పడి కేకలు వేయగా అప్రమత్తమైన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే కొట్టుకుపోయాడు. అతని ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు.
News October 4, 2025
శ్రీకాకుళం జిల్లాలో 13,887 మందికి రూ.15 వేల సాయం

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున నగదును వారి అకౌంట్లలో నేడు జమ చేయనుంది. ఈ వాహన మిత్ర పథకానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,341 మంది ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొత్తం రూ.21 కోట్ల మేర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ నేడు నగదును జమ సీఎం చంద్రబాబు చేయనున్నారు.