News April 10, 2024
LSGలోకి రోహిత్ శర్మ?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా వేలంలో హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవాలని LSG ఫ్రాంచైజీ ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఆయన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. మరోవైపు వచ్చే సీజన్‌కు ముంబైని వదిలేయాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 11, 2026
Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్‌కు పూర్తి కానుంది.
News January 11, 2026
మెగా158.. హీరోయిన్గా ఐశ్వర్యరాయ్?

చిరంజీవి తర్వాతి మూవీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగాస్టార్‌తో మాజీ ప్రపంచసుందరి తొలిసారి నటించే అవకాశముంది. అటు ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని టాక్. ఈ సారి మెగాస్టార్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
News January 11, 2026
చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.


