News April 10, 2024
‘సలార్-2’: 2025 సమ్మర్‌లో రిలీజ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ‘సలార్-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభమవుతుందని సినీవర్గాలు తెలిపాయి. వచ్చే వేసవికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ ఇప్పటికే నటీనటుల డేట్స్ కన్ఫర్మ్ చేశారని సమాచారం.
Similar News
News March 21, 2026
కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?
News March 21, 2026
పాక్ క్రికెట్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్: గ్యారీ కిర్‌స్టెన్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర విమర్శలు చేశారు. బోర్డులో ఇతరుల జోక్యం, టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా ఆయన APR 15న శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు <<19339760>>చేపట్టనున్నారు.<<>>
News March 21, 2026
రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.


