News April 10, 2024
HYD: పుస్తక ప్రేమికులకు GOOD NEWS

HYDలోని పుస్తక ప్రేమికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కాన్ కోర్స్ లెవెల్ వద్ద ఉచితంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కాగా.. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు బుక్ ఫెయిర్ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
Similar News
News March 14, 2026
‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
News March 14, 2026
HYD: 600 ఎకరాల భూమి వేలం!

బడ్జెట్‌లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్‌పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని క్యాబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
News March 14, 2026
హైదరాబాద్‌లో పెరిగిన ఎయిర్ పొల్యూషన్

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం అంబియాన్స్ పోర్టు హైదరాబాద్‌లో 240గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇటీవల మొదలైన కట్టెల పొయ్యితో మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


