News April 10, 2024

దర్శి వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన గొట్టిపాటి లక్ష్మి

image

దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను దర్శి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆహ్వానం మేరకు గొట్టిపాటి లక్ష్మి కలిసినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను గొట్టిపాటి లక్ష్మి కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 4, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చీమకుర్తి (M)లో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూ.2వేల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2026

మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం

image

ఒంగోలు రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలులోని ప్రజలకు తెలుసు అని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్‌తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల సమాధానం ఇచ్చారు.

News March 4, 2026

ప్రకాశం: తౌషిక్ మృతి.. పాఠశాలకు షోకాజ్ నోటీస్

image

ప్రకాశం(D) S.కొండ చైతన్య పాఠశాలలో ఇటీవల 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. కమిటీ పాఠశాలను సందర్శించి అనేక లోపాలను గుర్తించింది. నివేదికను పరిశీలించిన DEO రేణుకకు ఇవ్వగా ఆమె పాఠశాల యాజమాన్యానికి మంగళవారం షోకాజ్ జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో తెలపాలన్నారు.