News November 2, 2025
నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.
Similar News
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.
News November 3, 2025
టేకులపల్లి: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

టేకులపల్లి మండలం కొండగులబోడు గ్రామానికి చెందిన భూక్యా వినోద్(28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తగూడెం హోండా షోరూంలో వినోద్ పని చేస్తున్నాడు. సెలవు దినం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 3, 2025
శక్తిమంతమైన శివ మంత్రాలు

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. కరచరణా కృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ్ శంభో


