News November 2, 2025

ఫైబర్ వేటిలో ఎక్కువగా ఉంటుందంటే..

image

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఓట్స్‌, బార్లీ, యాపిల్ , సిట్ర‌స్ పండ్లు, అర‌టి, పియ‌ర్స్‌, బెర్రీస్, క్యారెట్లు, మొల‌క‌లు, చియా విత్త‌నాలు, అవిసె గింజ‌లు, బ్రౌన్ రైస్‌, క్వినోవా, మొక్క‌జొన్న‌, బాదం, వాల్ న‌ట్స్‌, గుమ్మ‌డి విత్త‌నాలు, కాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ, ప‌చ్చి బ‌టానీ, కొత్తిమీర‌, పాల‌కూర‌, పుదీనా, తోట‌కూర‌, జామ, న‌ల్ల శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది. క‌నుక వీటిని రోజూ తింటుంటే ఫైబ‌ర్‌ను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.

Similar News

News November 3, 2025

బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

image

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వంటి చర్మవ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News November 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 55

image

1. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు?
2. విచిత్రవీర్యుని తండ్రి ఎవరు?
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు?
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు ఏమంటారు?
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని ఏమంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 3, 2025

పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.