News November 2, 2025
దీపం వెలిగిస్తుండగా మంటలు.. బాలిక మృతి

వెల్దుర్తి(M) నర్సాపురంలో నిప్పు అంటుకొని బాలిక మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక మాసం సందర్భంగా గత సోమవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గొల్ల బుడ్డన్న కుమార్తె రేవతి(9) తీవ్రంగా గాయపడింది. బాలికకు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా కోలుకోలేక శుక్రవారం మృతిచెందింది. కాగా, ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News November 3, 2025
రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.
News November 3, 2025
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయానికి 102 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి 102 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీ ఆదేశించారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ రెడ్డి ‘7 రోజుల ప్రచార వ్యూహం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం BRSను లక్ష్యంగా చేసుకుని ‘7 రోజుల ప్రచార వ్యూహం’ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. ఈవ్యూహంలో KCR అవినీతి పాలన చేశారనే విషయాన్ని రేవంత్ రెడ్డి హైలైట్ చేయనున్నారు. BRSనేతల ఇంటింటి ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై ప్రచారం చేయాలని మంత్రులను కోరారు. GHMC మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షించనున్నారు.


