News November 2, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా.!

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ KG రూ.200- రూ.220 మధ్య ధర పలుకుతోంది. స్కిన్ లెస్ కేజీ రూ.230- రూ.250 ధర పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.160-రూ.170 మధ్య ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-రూ.20 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.
News November 3, 2025
హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.
News November 3, 2025
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.


