News November 2, 2025
కాంగ్రెస్ కార్యాలయాన్ని BRSగా మార్చడమే ఆందోళనకు కారణమా..?

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు 2018లో గెలిచారు. ఆ తరువాత BRSలో చేరి అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయ వివాదం తెర మీదికి వచ్చింది. దీంతో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌కి నిప్పు పెట్టారు. అనంతరం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 3, 2025
బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: మేయర్

చిన్న వడ్డేపల్లి మత్తడి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ పరిధి లోని చిన్న వడ్డేపల్లి చెరువు, రామన్న పేట గాంధీ బొమ్మ ప్రాంతంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నీటిని డక్ట్‌లోకి పంపించాలని అధికారులకు సూచించారు.
News November 3, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

➢ CM రేవంత్‌తో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ.. ఈ నెల 14న కొడంగల్‌లోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. ఈ కిచెన్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా
➢ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
➢ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI నిబంధన ఎత్తివేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
News November 3, 2025
పాలిటెక్నిక్‌లో సత్తాచాటిన విద్యార్థినులు

ఆదివారం విడుదలైన 1st డి-ఫార్మసీ ఫలితాల్లో హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. షాజియా భాను 990 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమీనా త్యాహిమ్ (969), గ్రీష్మ సాయి రెడ్డి (962), సానియా సుల్తానా (962), అమ్రీన్ భాను (943), ఆర్సియా(933) మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.


