News November 2, 2025
SRSP UPDATE: 16 గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 16 వరద గేట్ల ద్వారా 47,059 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 56,513 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో 80.501 TMCల నీరు నిల్వ ఉందని వివరించారు.
Similar News
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్‌బాబు ఈరోజు HYD నేరెడ్‌మెట్‌లోని CP ఆఫీస్‌లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్‌కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్‌రావు, CI సెల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.

మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.