News November 2, 2025
రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది: కేటీఆర్

మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల BRS కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్నారు.
Similar News
News November 4, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. VKB జిల్లా వాసులే 15 మంది

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు అధికులు VKB జిల్లాకు చెందిన వారే. తాండూర్: షేక్ ఖాలీద్ హుస్సేన్, జహాన్, నందిని, సాయిప్రియ, తనూష, వెంకటమ్మ, సెలేహ బేగం, జహీరా ఫాతిమా (పసిపాప), ముస్కాన్ బేగం, యాలాల్: గుర్రాల అఖిలా రెడ్డి, బందెప్ప, లక్ష్మి, దౌల్తాబాద్: హనుమంతు, బషీరాబాద్: దస్తరి బాబా (బస్సు డ్రైవర్) మృతి చెందారు.
News November 4, 2025
ఏపీ రౌండప్

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!  
News November 4, 2025
సమానత్వం అప్పుడే ఎక్కువ

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.


