News November 2, 2025

ఈనెల 11న కొత్తగూడెంలో జాబ్ మేళా

image

సింగ‌రేణి స‌హ‌కారంతో కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 11న నిర్వ‌హించే మెగా జాబ్ మేళాను యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుతో క‌లిసి బ్రోచర్ ఆవిష్కరించారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ చదివి18-40 ఏళ్ల వయస్సు గల వారు అర్హులన్నారు.

Similar News

News November 3, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 160 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 77, సెంట్రల్ జోన్ పరిధిలో 26, వెస్ట్ జోన్ పరిధిలో 28 ఈస్ట్ జోన్ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయి.

News November 3, 2025

ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

image

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.

News November 3, 2025

డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

image

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?