News April 10, 2024

సాయంకాలం వ్యాయామం చేస్తే..

image

చక్కటి ఆరోగ్యం కోసం ఎక్కువశాతంమంది ఉదయాన్నే వ్యాయామం చేస్తుంటారు. అయితే, సాయంకాలం వ్యాయామంతో ఫలితం అధికంగా ఉంటుందట. సాయంత్రం వ్యాయామంతో మధుమేహం, ఊబకాయ సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు. వ్యాయామం మాత్రమే కాక ఆహారపు అలవాట్లు, జీవన శైలి కూడా మెరుగ్గా ఉంటేనే ఫలితం ఉంటుందని సూచించారు. డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు.

Similar News

News October 10, 2024

బ్రూక్&రూట్.. WORLD RECORD

image

పాక్‌తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్‌నర్‌షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్‌మన్&పోన్స్‌ఫోర్డ్(AUS) ఇంగ్లండ్‌పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.

News October 10, 2024

రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారు?: అవినాశ్

image

AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.

News October 10, 2024

Stock Market: స్వల్ప లాభాలతో గట్టెక్కాయి

image

స్టాక్ మార్కెట్లు గురువారం స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 81,611 వ‌ద్ద‌, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,998 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. సెన్సెక్స్‌లో 82,000 వ‌ద్ద ఉన్న రెసిస్టెన్స్ అడ్డుగోడ‌లా ప‌నిచేయ‌డంతో సూచీ ముందుకు క‌దల్లేదు. అటు నిఫ్టీలోనూ 25,135 వ‌ద్ద Day Highని సూచీ దాట‌లేదు. Kotak Bank, JSW Steel, HDFC, BEL టాప్ గెయినర్స్. Cipla, Techm, Trent, Sun Pharma టాప్ లూజర్స్.