News November 2, 2025

‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

image

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.

Similar News

News November 3, 2025

గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

image

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక‌తో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ‌ర్భిణుల్లో విట‌మిన్ డి లోపం ఉండ‌డం వ‌ల్ల శిశువులు అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు, మ‌ల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ D సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మిలో సమయం గడపడం వల్ల దీన్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు.

News November 3, 2025

ఒకేరోజు రూ.2వేలు పెరిగిన సిల్వర్ రేటు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 ఎగబాకి రూ.1,12,900 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 3, 2025

కాసేపట్లో ఘటనాస్థలికి మంత్రి పొన్నం

image

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాసేపట్లో ఆయన ఘటనాస్థలికి చేరుకోనున్నారు. మీర్జాగూడ ఘటన కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.