News November 2, 2025
HYD: అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్య ప్రవర్తన

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన HYDబంజారాహిల్స్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..ఇందిరానగర్‌లో నివసించే ఇద్దరు అమ్మాయిలు బర్త్ డే వేడుకల అనంతరం తమ సోదరుడిని ఇంటికి పంపించి వస్తున్నారు. అదే వీధిలో ఉండే బాలు,నవీన్ వారిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించగా బాలికలు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 3, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 160 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 77, సెంట్రల్ జోన్ పరిధిలో 26, వెస్ట్ జోన్ పరిధిలో 28 ఈస్ట్ జోన్ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయి.
News November 3, 2025
ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.
News November 3, 2025
డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?


