News November 2, 2025

మన్యం: ‘మీ కోసం వెబ్‌సైట్‌లో PGRS నమోదు చేయవచ్చు’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో PGRS ద్వారా సోమవారం అర్జీలు స్వీకరిస్తామన్నారు.

Similar News

News November 3, 2025

ఇంటర్నేషనల్ మ్యాచే ఆడలేదు.. WC నెగ్గారు

image

భారత మహిళల <<18182320>>క్రికెట్<<>> చరిత్రలో హెడ్ కోచ్ ‘అమోల్ ముజుందర్’ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత్ WC లిఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బోర్న్ డొమెస్టిక్ స్టార్.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచూ ఆడలేదు. టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలన్న తన కలను ఈ విధంగా సాకారం చేసుకున్నారు. ‘క్రెడిట్ అంతా మహిళలకే దక్కుతుంది. ఓటములతో మేము కుంగి పోలేదు. ఇవాళ మా లక్ష్యాన్ని సాధించాం’ అని ముజుందర్ తెలిపారు.

News November 3, 2025

జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

image

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.

News November 3, 2025

సర్పాలు, నాగులు ఒకటి కాదా?

image

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.