News November 2, 2025

KMR: రేపు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి

image

కామారెడ్డిలో విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్‌వో, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 4, 2025

అమ్రాబాద్: పుష్కర కాలంగా ఇన్‌ఛార్జ్‌లే దిక్కు

image

నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) కార్యాలయానికి గత 12 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్‌లతో కొనసాగుతుంది. కీలక శాఖల పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచులకు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అంటున్నారు. రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ను నియమించాలని చెంచులు కోరుతున్నారు.

News November 4, 2025

గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

image

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్‌, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

News November 4, 2025

అభివృద్ధికి నోచుకోని కందగిరి.. బండరాళ్లే మెట్లు!

image

జిల్లాలోని కురవి(M) కందికొండ శివారు కందగిరి కొండపై ప్రాచీన కాలం నాటి కట్టడాలు ఉన్నా, అభివృద్ధి జాడ కనిపించడం లేదు. రెండున్నర కి.మీ. ఎత్తులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు బండరాళ్లే మెట్లుగా చేసుకుని ఎక్కుతున్నారు. గతంలో కేటీఆర్ ఇక్కడ మెట్లు నిర్మిస్తామని హామీ ఇవ్వగా, 2019లో శంకుస్థాపనతోనే ఆ పనులు నిలిచిపోయాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.