News April 10, 2024

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే..

image

AP: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు(క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను అధినేత పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు Xలో ట్వీట్ చేసింది.

Similar News

News March 13, 2026

మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

image

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <>సైట్‌లో<<>> MAR 31 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 2న పరీక్ష ఉంటుంది.

News March 13, 2026

ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీ సమయంలో గాఢ రసాయనాలుండే పెర్‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు, కాస్మెటిక్స్ వాడటం వల్ల ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటివల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చంటున్నారు. కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏవైనా వాడేముందు అందులో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

News March 13, 2026

జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా: సుప్రీంకోర్టు

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ దిశగా CBI దర్యాప్తు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా? అని CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే CBIకి ఇవ్వాలని సూచిస్తూ కేసు విచారణను ముగించారు.