News November 2, 2025

KMR: TGTA, TGRSA రాష్ట్ర సమావేశానికి జిల్లా ఉద్యోగులు

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల రెవిన్యూ ఉద్యోగులు ఆదివారం యాదగిరిగుట్టలో జరుగుతున్న తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్(TGTA), తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుటకు ఈ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News November 3, 2025

PU ‘RTF కోర్సు ఫీజులు విడుదల చేయాలి’

image

PU యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు 4 సంవత్సరాలుగా RTF ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫీజులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. స్కాలర్‌షిప్‌లు, కోర్సు ఫీజులు రాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పీయూ అధికారులు స్పందించి వెంటనే ఆర్‌టీఎఫ్‌ ఫీజులను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News November 3, 2025

ఊట్కూర్: సీసీఐ నిబంధనలతో పత్తి రైతులు ఆందోళన

image

సీసీఐ అధికారులు కొత్త నిబంధనలు పెట్టడంతో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో, రెండు రోజుల క్రితం 12 క్వింటాళ్లకు స్లాట్ బుక్ చేసుకున్న రైతులు నిబంధనలు మార్చడంతో ఊట్కూర్‌లోని వినాయక ఇండస్ట్రీస్ ఎదుట పత్తి కొనుగోలు కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు.

News November 3, 2025

చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.