News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదం.. పటాన్ చెరు నుంచి వెళ్లిన టిప్పర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణమైన టిప్పర్ పటాన్ చెరు లక్డారం క్రషర్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. గత కొన్ని రోజుల కింద జరిగిన కర్నూల్ బస్సు ప్రమాదం కూడా ట్రావెల్స్ బస్సు పటాన్ చెరు నుంచి బయలుదేరిందని, పటాన్ చెరు నుంచి బయలుదేరే వాహనాలు మృత్యువును వెంటాడుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
News November 3, 2025
భద్రాచలం: ‘మా ప్రాంతంలో మద్యం, బెల్టు షాపులు వద్దు’

భద్రాచలం టౌన్ ఐటీడీఏకు ఎదురుగా ఉన్న వైఎస్‌ఆర్ నగర్‌లో వినూత్న రీతిలో ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేయొద్దని కాలనీ వాసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పాఠశాల, దేవాలయం, మ్యూజియం వంటి ప్రధానమైన స్థలాలు ఉన్నాయని తెలిపారు. పర్యాటకులు తరచుగా వచ్చే ప్రాంతంలో మద్యం దుకాణాలను అనుమతించవద్దని కోరుతున్నారు.
News November 3, 2025
విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.


