News November 2, 2025
జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్‌కు లేదన్నారు.
Similar News
News November 3, 2025
వేప మందుల వాడకంలో మెళకువలు

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.
News November 3, 2025
పాపం దక్షిణాఫ్రికా

వైట్ బాల్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ కప్ గెలవాలనే కలకు మహిళల జట్టు కూడా అడుగుదూరంలోనే ఆగిపోయింది. ఫైనల్లో ఓటమితో ఆ జట్టుకు వరల్డ్ కప్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ ఏడాది మెన్స్ జట్టు WTC విజేతగా నిలిచినా గత ఏడాది T20WC ఫైనల్లో ఓటమి, తాజాగా WWC ఫైనల్లో ఓటమి ఆ దేశ ఫ్యాన్స్‌ను మరోసారి నిరాశకు గురిచేశాయి.
News November 3, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు

<


