News November 2, 2025

వనపర్తి: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు

image

బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పై చట్టరీత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం తెలిపారు. అమ్మాయిలు 18 సం. పూర్తి అయ్యే వరకు వారిని కచ్చితంగా చదివించాలన్నారు.18 సంవత్సరాల లోపే పెళ్లి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

Similar News

News November 3, 2025

శివారాధన సోమవారమే ఎందుకు?

image

సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తన రూపాన్ని పూర్తిగా కోల్పోకుండా కాపాడి శివుడు సోమనాథుడయ్యాడు. నెలవంకను శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడు. అందుకే ఈరోజున శివారాధన చేస్తే శివ సాక్షాత్కారం అందడమే కాక చంద్రుడి అనుగ్రహంతో ప్రశాంతత కలుగుతుందని శివ మహాపురాణం చెబుతోంది. సోమవారం ఈశ్వరుడిని ఏవిధంగా సేవించినా తప్పక మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
☞ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 3, 2025

ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

image

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్‌ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.

News November 3, 2025

బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

image

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.