News November 2, 2025

HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

image

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Similar News

News November 3, 2025

HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

image

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.