News November 2, 2025
నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
Similar News
News November 3, 2025
డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?
News November 3, 2025
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


