News November 2, 2025
జనగామ: రుద్రమదేవి సొసైటీలో అక్రమాలు.. ఆరుగురి ఉద్యోగుల తొలగింపు

జనగామ జిల్లా కేంద్రంలోని రుద్రమదేవి మహిళా సహకార సొసైటీలో అక్రమాల బాగోతం బయటపడింది. భూమి కొనుగోలు పేరుతో సొసైటీ నిధుల్లో రూ.7.09 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఉద్యోగులను తొలగించాలని గత నెల 24న తీర్పు రావడంతో, సొసైటీ కార్యాలయానికి నోటీసులు అంటించారు.
Similar News
News November 3, 2025
ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం!

శ్రీవారి దర్శనానికి ఎన్నో దారులున్నాయి. వీటిలో రక్తదానం చేసినవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు దీనిని 1985లో ప్రారంభించినా చాలామందికి ఇది తెలియదు. రక్తదాతలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్‌తో పాటు ఒక లడ్డూ & ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఇందుకోసం కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రిలో రోజూ పరిమిత వ్యక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. Share it
News November 3, 2025
కరీంనగర్ – జగిత్యాల ప్రయాణం.. వెరీ డేంజర్..!

JGTL-KNR రెండు వరసల రోడ్డు ఇరుకుగా ఉండడం, వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో అటువైపు ప్రయాణం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు గుంతలరోడ్లు ప్రమాదాలకు వెల్కమ్ చెబుతున్నాయి. NH-563పై JGTL-KNR వరకు దాదాపు 50 కి.మీ మేర 4 లైన్ల రోడ్డు విస్తరణకు రూ.2,484కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పనులు వేగంగా ప్రారంభించకుంటే రంగారెడ్డి(D) మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలు ఇక్కడ కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉంది.
News November 3, 2025
కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


