News April 10, 2024
BIG BREAKING: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. పవన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. కాగా ఇటీవల చంద్రబాబు, జగన్‌కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2026
నవోదయ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) JNVST 6వ తరగతి ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేసింది. షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్ ఖరారు అవుతుంది. రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News March 17, 2026
ఏపీకి అదనపు LPG, తెలంగాణకు ఎప్పుడు?

ఏపీకి కేంద్రం అదనంగా <<19410312>>24,000<<>> మెట్రిక్ టన్నుల LPGని కేటాయించగా, తెలంగాణ ఇంకా స్పందన కోసం ఎదురుచూస్తోంది. వాణిజ్య అవసరాల కోసం అదనపు LPG కోరుతూ మంత్రి ఉత్తమ్ 3 రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో కొరతతో హోటల్ పరిశ్రమ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. నేటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్తమ్ కేంద్ర అధికారులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.
News March 17, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సానియా మీర్జాకు భయానక అనుభవం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అక్కడ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె మీడియాకు వివరించారు. ‘మేమున్న ఇంటి పైనుంచే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానినొకటి అడ్డుకోవడం చూశాం. మా ఇంటికి 400-500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి’ అని తెలిపారు.


