News November 2, 2025

విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

image

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు.

Similar News

News November 4, 2025

ఒంటిమిట్టలో త్వరలో నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో త్వరలోనే నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన నిత్య అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని పరిశీలించారు. తాత్కాలిక ప్రమాద రహిత జర్మన్ షెడ్లతో నిత్య అన్న ప్రసాద కేంద్రం ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

News November 3, 2025

వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం ఇంటర్వ్యూ

image

కడపలోని వైవీయూలో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈనెల 6న ఉదయం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు బయోఇన్ఫర్మేటిక్స్ / బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ / ఎంటెక్ బయోఇన్ఫర్మేటిక్స్‌లో 5 ఏళ్ల MSc, నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం yvu.edu.in ని సందర్శించాలన్నారు.

News November 3, 2025

ఒంటిమిట్ట రామాలయంలో TTD క్యాలెండర్లు

image

TTD 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తామన్నారు.