News November 2, 2025
విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు. అలాగే 9133331912 నంబరుకు చాట్ ద్వారా కూడా సమస్యలు పంపవచ్చని కోరారు.
Similar News
News November 3, 2025
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News November 3, 2025
పుట్టపర్తి కలెక్టరేట్‌కు 306 అర్జీలు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. నాణ్యతే ప్రామాణికంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి 306 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.
News November 3, 2025
మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి కారణం ఇదే..

కడుపునిండా తిన్నా కొందరికి అర్ధరాత్రిళ్లు ఆకలివేస్తూ ఉంటుంది. సరిగా నిద్రపట్టక దొరికిన స్నాక్స్ తినేస్తారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్‌లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.


