News November 2, 2025

భద్రాద్రి: రేపు డివిజన్ల వారీగా ప్రజావాణి

image

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కలెక్టరేట్ ఇన్ వార్డులో కూడా తమ దరఖాస్తులు ఇవ్వొచ్చని సూచించారు.

Similar News

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.

News November 3, 2025

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

image

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ సోమవారం పొక్సో కోర్టు జడ్జి చినబాబు తీర్పు చెప్పారు. తాడిమర్రి మండలం మరువపల్లికి చెందిన అమర్నాథ రెడ్డిపై 2022లో అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలను కోర్టుకు అందించారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.

News November 3, 2025

కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

image

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.