News November 2, 2025

మణుగూరు దాడి.. భద్రాచలం MLA ఎటువైపు?

image

తాను BRS పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కు తెలిపిన భద్రాచలం MLA తెల్లం వెంకటరావు ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మణుగూరులోని BRS కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. దాడిని ఖండించక పోవడం, మద్దతు ప్రకటించకపోవడంపై BRS శ్రేణులు, సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తారో లేదో చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Similar News

News November 3, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.

చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

image

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.