News November 2, 2025

జనగామలో రేపటి ప్రజావాణి రద్దు

image

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా సర్వేలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News November 3, 2025

మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

image

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.

చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

image

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.