News November 2, 2025
హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్‌ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
Similar News
News November 3, 2025
హైదరాబాద్‌లో వర్షం షురూ..

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.
News November 3, 2025
ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామనడం సరికాదు: ఒవైసీ

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.


