News November 3, 2025

KMR: రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి: MLC

image

రేపటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బందుకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆదివారం
హైదారాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే రూ.900 కోట్లు, పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ ప్రైవేటు విద్యాసంస్థలను మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

Similar News

News November 3, 2025

నాలాలపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు: మేయర్

image

ఆక్రమణలకు గురైన నాలా ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన రిటైనింగ్ వాల్ నిర్మాణాలను చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. HNK పరిధిలోని వరద ముంపునకు గురైన ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణ పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు సూచనలు చేశారు. వరద ముంపునకు గురైన గృహాల వాస్తవ సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని అధికారులకు మేయర్ స్పష్టం చేశారు.

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2025

మంచిర్యాల: 4న ఉచిత చేప పిల్లల పంపిణీ

image

జిల్లాలోని లక్షట్టిపేట మండలం గుండ్ల కోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈనెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ చెప్పారు. జిల్లాలోని 380చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయని,వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35-40మి.మీ చేప పిల్లలు,5 పెరినియల్,6రిజర్వాయర్లలో 108.28 లక్షల చేప పిల్లలను వదలుతామన్నారు.