News April 10, 2024
కామారెడ్డి: రూ.5.45 లక్షల పట్టివేత

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కామారెడ్డి జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేని నగదును సీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బుధవారం జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్‌పోస్ట్ వద్ద SI సుధాకర్ అధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా రూ. 5.45 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించిన ఆధారాలు, లెక్కలు చూపించకపోవడంతో డబ్బులను పోలీసులు సీజ్ చేశారు.
Similar News
News April 20, 2025
నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.
News April 20, 2025
NZB: ‘దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి సాగు’

దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు ఆదేశించారు.
News April 19, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం: కలెక్టర్

భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతిపై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.