News April 10, 2024
మాచర్ల నుంచి గుంటూరు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ

మాచర్ల నుంచి గుంటూరు వరకు, గుంటూరు నుంచి మాచర్ల వరకు నడిచే రైలును తిరిగి ప్రారంభిస్తున్నట్లు గుంటూరు రైల్వే డిఆర్‌ఎం రామకృష్ణ బుధవారం తెలిపారు. 20 రోజులుగా ఈ రైలు నిలిచిపోవడంతో ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే జేఆర్‌యు సిసి మెంబర్ మద్దాల సుబ్బయ్య, గుంటూరు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు నేటినుంచి ప్రారంభిస్తామన్నారు.
Similar News
News February 20, 2026
గుంటూరు: ‘స్త్రీ శక్తి’తో 1.70 లక్షల టికెట్లు

మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా భక్తుల ప్రయాణం భారీగా పెరిగింది. స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా
మహిళలు శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, గోవాడ వంటి శైవక్షేత్రాలకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని 5 డిపోల నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. 2 రోజుల్లో 1.70 లక్షల మందికి పైగా మహిళలకు జీరో టిక్కెట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందన్నారు.
News February 20, 2026
గుంటూరులో స్టూడెంట్ అదృశ్యం..!

వేదపాఠశాల విద్యార్థి అదృశ్యమైనట్లు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల (D) సంతమాగులూరు (M) మిన్నెకల్లుకు చెందిన పదిహేనేళ్ల తుర్లపాటి వెంకటసాయి రమేశ్ ఎండ్రాయి వేదపాఠశాలలో చదువుతున్నాడు. రెండ్రోజుల కిందట పాఠశాల నుంచి గుంటూరు శ్రీనగర్‌లోని అమమ్మ ఇంటికి వచ్చాడు. 18న లాడ్జిసెంటర్‌లో ఆటో ఎక్కి కనిపించకుండా పోయాడు. విద్యార్థి తల్లి పద్మప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
News February 19, 2026
అమరావతిలో పలు సంస్థలకు భూములు

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్‌బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్‌లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్‌బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.


