News November 3, 2025
రోజూ శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే..

శివలింగానికి రోజూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అభిషేకం ఆరోగ్యంతో పాటు, బలం, యశస్సు, కీర్తిని ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ‘పెరుగు చాలా శుభప్రదమైనది. పౌష్టికపరమైనది. ఈ అభిషేకం భక్తుల శారీరక, మానసిక రోగాలను మాయం చేస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగి, మంచి వ్యక్తిత్వంతో జీవించడానికి శివానుగ్రహం లభిస్తుంది’ అంటున్నారు.
Similar News
News November 3, 2025
ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.
News November 3, 2025
మట్టి నింపిన బావులపై ఇల్లు కట్టుకోవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం సురక్షితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. మట్టి నింపిన బావులు, గుంటలపై ఉండే ఇల్లు ప్రమాదానికి సంకేతమన్నారు. ‘ఈ స్థలాల్లో పునాదులు నిలవలేవు. భూమి జారే అవకాశముంది. నీరు నిలిచి ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది నివాసితుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంటికి స్థిరత్వం, నివాసితులకు ఆరోగ్యం సిద్ధించాలంటే ఇలాంటి భూములను విడిచిపెట్టాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>
News November 3, 2025
రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.


