News April 10, 2024
రెండింటిలోనూ చింతా మోహన్ హ్యాట్రిక్

కాంగ్రెస్ తిరుపతి MP అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గెలుపు, ఓటమిలో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 1984లో టీడీపీ అభ్యర్థిగా, 1989, 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1996లో పోటీ చేయలేదు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో గెలిచారు. 2014, 2019, 2021లో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నారు. 2021 ఉప ఎన్నికల్లో 9585 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 11వ సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News April 18, 2026
చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.
News April 17, 2026
బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 17, 2026
గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.


