News November 3, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.

Similar News

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

News November 4, 2025

డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

image

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.

News November 3, 2025

ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రేపు ఉ.8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.